telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమెజాన్ లో విడుదలకు ‘మాస్టర్’ ప్లాన్

master

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయింది. ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ సినిమా రంగంపై భారీగా పడింది. షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు కరోనా కారణంగా ఆగిపోయాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్నసినిమాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోతే దాని వల్ల వచ్చే నష్టం మామూలుగా ఉండదు. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు డిజిటిల్ స్ట్రీమింగ్స్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా తాజాగా హిందీ నటుడు అక్షయ్ కుమార్ తన సినిమా లక్ష్మీబాంబ్‌ను డిస్నీ హట్ స్టార్‌‌లో స్ట్రీమింగ్ చేయాలనీ భావిస్తున్నాడు. దానికి సంబందించిన ఓ ఒప్పందం కూడా కుదిరిందట. తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమా కూడా అమెజాన్ లో విడుదల చేయాలనీ చూస్తున్నారట నిర్మాతలు. అయితే అక్కడ థియేటర్స్ యాజమాన్యం ఏవిధంగా రెస్పాండ్ అవుతారో అని చూస్తున్నారట. ఎందుకంటే హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్మగల్ వంధాల్’ అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనీ భావించాడు. అయితే అలా చేయడానికి తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం ఒప్పుకోలేదు. మరి విజయ్ నిర్ణయం పట్ల అక్కడి థియేటర్స్ యజమానులు ఏవిధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Related posts