telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ ఇండస్ట్రీకి ఇష్టం లేకుండానే వచ్చా : నయనతార

nayanatara agreed to promote syeraa

విభిన్నమైన పాత్రలతో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది నయనతార. ఈమె ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చిందట. ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ, ఆరంభంలో నటన పట్ల తనకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్పడం విశేషం. ఒకప్పుడు నాకు సినిమాలంటే ఇష్టం లేదు. ఇంక నటన అంటే ఏకోశానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవు. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని. 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చింది. ముందు చేయననే అన్నాను. కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకుని ఆ సినిమా చేశాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. ఆ సంవత్సరంలో దాదాపు ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాను. మధ్యలో నా వ్యక్తిగత కారణాల వలన సినిమాలకు కొద్దిగా దూరమయ్యాను తప్ప అవకాశాలు లేక మాత్రం కాదు అని నయనతార చెప్పుకొచ్చింది.

Related posts