నీకు నువ్వుగా…ఇలా
ఎంతకాలం బంధించుకుంటావ్
నీ పిడికిట నువ్వే…ఇలా
బాందీవై అలమటిస్తావ్…
నీలోని అభ్యుదయ భావాలను
నీకు నీవుగా కాలరాసు కుంటావ్
ఆత్మ సాక్షిని చంపుకుంటూ…
ఎంతకాలం అబద్దంలో జీవిస్తావ్
ఆత్మీయ హృదయం నీదైనా…
ఆంక్షల హద్దుల్లో ఎలా ఉండి పోతావ్
మనసులో మమతలు ఉప్పొంగినా
హద్దులు దాటనివ్వకుండా….
నీకు నీవే శిక్ష విధించుకుంటావ్
ప్రాణమా!విశాలమైన ఈ జగతిలో
ఉన్నతమైన నీ వ్యక్తిత్వాన్ని ప్రకాశించనీ
మంచికి,మానవత్వానికి….నీ
మనస్సు ఎప్పుడూ బందీ కాదనీ
మరోమారు నిరూపణ కానీ….
నీకు నీవుగా ఏర్పరుచుకున్న….
ఈ సంకుచిత బంధాలన్నీ తెంపుకో
నీలోని మానవత్వపు విహంగాన్ని..
నిత్యం ఆనందంతో విహరించనీ….
ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పూజా…