telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదు : విజయసాయి రెడ్డి

vijayasaireddy ycp

విశాఖలో పాదయాత్ర చేసిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పోరాటాలు ప్రాణ త్యాగాలుతో విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని సాదించుకున్నామన్న ఆయన ప్రైవేటీకరణ ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎవరో ప్రైవేట వ్యక్తులకు దీనిని కట్టబెడతాం అంటే ఎవ్వరు ఒప్పుకోరని స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ పై వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు. పోస్కో కంపెనీల గురించి కార్మిక సంఘాలకు సీఎం జగన్ చెప్పారని ప్రకాశం జిల్లా లో ఉన్న మైన్స్  లో  గ్రేడ్ మైన్స్ వాటి వల్ల ఉపయోగం లేదని అన్నారు. అలానే విశాఖకు రావద్దని జగన్ పోస్కో వాళ్ళకు చెప్పారన్న ఆయన ఓరిస్సా లో మైన్స్ కోసం నగదు చెల్లించిన ఇప్పటి వరకు దాని ఊసే లేదని అన్నారు. ఉత్పత్తి స్థిరికరణ ఎంతో ముఖ్యం దానిని సీఎం కార్మిక సంఘాల కు తెలిపారు ఇదే విషయాన్ని నేను చేపుతున్నాను ఉత్పత్తి ఆపి మరింత నష్టాల తేవద్దని అన్నారు. స్టీల్ ప్లాంట్ లో స్థానిక ఉద్యోగులు ఉన్నతాధికారులు అన్నిఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఉద్యోగులు చేతుల్లో ఉన్నాయని అన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని వద్దకు తీసుకు వెళ్తామన్న ఆయన పార్లమెంట్ బయట లోపల పోరాడేందుకు వైసీపీ సిద్దం గా ఉన్నామని అన్నారు. పోరాడే ప్రతి ఒక్కరికి మా సంపూర్ణ మద్దతు ఉందని, ప్రతిపక్షాలు అడిగితే ప్రధాని సమయం ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరు ఎందుకు లేఖ రాయలేదు చంద్రబాబు గారు అని ప్రశ్నించారు

Related posts