telugu navyamedia
సినిమా వార్తలు

రౌడీ బాయ్ త‌ల్లికి క్రేజీ గిప్ట్‌..!

రౌడీ బాయ్ విజయ్ దేవర్ కొండకు ఉన్న యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. అతి తక్కువ కాలంలో ఎవరికీ దక్కని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు రౌడీ బాయ్‌.. విజయ్ యాటిట్యూడ్, డ్రెస్సింగ్స్ స్టైల్ , మాట్లాడే విధానం యూత్‌ని ఆక‌ట్టుకుంటాయి. పెళ్లి చూపులు సినిమాతో అందరి దృష్టిలో పడిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.

Taxiwaala' Is An Edge-Of-The Seat Film: Vijay Devarakonda - Desimartini

ఇదిలా ఉంటే..తన తల్లికి థియేటర్‌ను బర్ద్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు విజయ్ దేవర్ కొండ .‘హ్యాపీ బర్త్‌ డే మమ్ములు‘ మీరు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉంటే..తాను మరింత కష్టపడి మరిన్ని జ్ఞాపకాలను ఇస్తానని‘ ట్వీట్ చేశారు విజయ్. థియేటర్‌ హాల్‌లో తల్లి మాధవి ఉన్న ఫొటోను సోష‌ల్‌మీడియా వేదిక‌గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. .

తన స్వస్థలమైన మహబూబ్ నగర్ లో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ఏవీడి సినిమా మల్టీఫ్లెక్స్ ను నిర్మించారు విజయ్ దేవర కొండ. మల్టీప్లెక్స్‌ను విజయ్ దేవరకొండ నాన్న గారు గోవర్ధన్ దేవరకొండతో పాటు ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు భరత్ నారంగ్, ఏషియన్ సునీల్, దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.

తనకు సినిమా అవకాశాలతో గుర్తింపు ఇచ్చిన శేఖర్‌ కమ్ములకు కృతజ్ఞతగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ సినిమాను మొద‌ట‌గా ఈ థియేటర్లో ప్రదర్శించాడు.

Related posts