telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు ఇష్టం లేకపోయినా బెడ్ సీన్ లో నటించా : రాశి ఖన్నా

rasikhanna hot photo posts in instagram

టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది రాశి ఖన్నా. ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో విజయ్‌తో కలిసి రాశి రోమాన్స్ చేసింది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం మాత్రం రాశికి ఇష్టం లేకపోయినప్పటికీ ఓ బెడ్‌ సీన్‌లో నటించింది. ఆ సన్నివేశంలో నటించే సమయంలో తన అనుభవాలను రాశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఎంత సినిమా అయినా నా లిమిట్స్ నేను క్రాస్ చేయకూడదని నిర్ణయించుకున్నా. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నా లిమిట్స్ నేను క్రాస్ చేయాల్సి వచ్చింది. విజయ్‌తో రోమాంటిక్ సీన్ ఉందని అమ్మా, నాన్నలకు చెప్పా. వారు కంగారు పడ్డారు. అది ఒక క్యారెక్టర్‌లా మాత్రమే చూడమని.. పట్టించుకోకండి అని చెప్పా. ఆ టైంలో విజయ్ దేవర కొండ ఒక మాట చెప్పాడు. రాశి ఆల్రెడీ నాకు ఇలాంటి ఇమేజ్ ఉంది. కానీ నీకు ఇది కొత్త. నీకు ఇవ్వగలిగినంత సపోర్ట్ నా నుంచి ఉంటుందని చెప్పాడు. అతని మాటలతో కొంత కూల్‌ అయ్యా. కానీ ఆ సన్నివేశం చేసిన తర్వాత ఇలాంటివి అవసరమాఅనిపించింది. ఫ్యాన్స్ నన్ను రాశి ఖన్నాలాగే చూస్తారు. ఆ సన్నివేశాలపై నాకు ఆసక్తి కూడా లేదని తన మనసులోని మాట చెప్పుకొచ్చింది రాశి ఖన్నా.

Related posts