telugu navyamedia
సినిమా వార్తలు

“వెంకీమామ‌” దీపావళి పోస్టర్ అదిరింది

Venkey-Mama

వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దేశానికి వెన్నెముక‌లైన జై జైవాన్ అంటై సైనికుడిగా నాగ‌చైత‌న్య‌, జై కిసాన్ అంటూ రైతు పాత్ర‌లో వెంక‌టేశ్ ఉన్న పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Related posts