‘మా’లో మరోకొత్త ట్విస్ట్. ఎన్నికల టైమ్‌లో తమపై దౌర్జన్యం చేసి, దాడి జరిగిందనిచేశారని, సీసీ పుటేజ్‌లో దాడి విజువల్స్ ఉన్నాయని ప్రకాష్‌రాజ్ ఆరోపించిని విషయం తెలిసిందే.
పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్‌రాజ్ తాజాగా ఆయన ప్యానల్ సభ్యులతో కలిసిజూబ్లీహిల్స్ స్కూల్‌కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ తమకు అందించాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ను డిమాండ్ చేశారు.
అయితే కృష్ణమోహన్ మాత్రం దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఎవరు పడితే వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించలేమని అన్నట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఈసీ నుంచి రిప్లయ్ రావడం లేదంటూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కి స్ వెళ్లారు. అక్కడినుంచి పోలీసులకు కాల్ చేశారు. అయితే సీసీ ఫుటేజ్ చూడాలంటే ఇరు వర్గాల ప్యానల్ సభ్యులు ఉండాలని పోలీసులు సూచించారు.
దీనిపై ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, సందేహాల నివృత్తి కోసమే పోలింగ్ కేంద్రానికి వెళ్లామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. విష్ణుపై తనకేం కోపం లేదని, ఆయన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తన పని తాను చేసుకుంటున్నాడు. పైగా సీసీటీవీ ఫుటేజ్ చూడమని తనకు అభ్యంతరం లేదని చెప్పాడు బాగుంది. కానీ ఎన్నికల అధికారి మాత్రం ఒప్పుకోలేదని, అధికారితోనే తమకు ప్రధాన సమస్య అని ప్రకాశ్‌రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, తనీష్ వంటివారు స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులతో పాటు ప్రకాష్ రాజ్ బృందం సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
వందలసార్లు పచ్చి బూతులు తిడుతున్నారు… సింగర్ చిన్మయి శ్రీపాద