telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీ గ‌ణ‌ప‌తి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం జగన్..

విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్ళారు. ఆశ్రమంలోని తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానంద స్వామితో సమావేశమై, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆ తర్వాత సచ్చిదానంద స్వామికి నూతన వస్త్రాలను, పండ్లు ఇచ్చారు. సచ్చిదానంద స్వామి సీఎం జగన్‌కు శాలువ కప్పి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌తో సమావేశం అనంతరం గణపతి సచ్చిదానందస్వామి మీడియాతో మాట్లాడుతూ..నిబంధ‌న‌లు అంద‌రూ పాటిస్తే క‌రోనా తగ్గిపోతుందని…. ఆల‌య భూములు నాశ‌నం కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం జగన్‌ను కోరామని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు సంతోషంగా ఉన్నారు. అర్చక‌త్వ అవ‌కాశాల‌ను వార‌స‌త్వంగా ఇవ్వాల‌ని కోరానని..అందుకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు’ అని గణపతి సచ్చిదానందస్వామి తెలిపారు.

Related posts