telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కనగరాజ్‌ను క్వారంటైన్ కు పంపించాలి: వీహెచ్

hanmanth rao congress

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్‌ను నూతన ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మాజీ జస్టీస్ కనగరాజ్‌ను నియమించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఘాటుగా స్పందించారు.
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవు తున్న సమయంలో ఇతర ప్రదేశాలనుంచి ఎవరు వచ్చినా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు తమిళనాడు నుంచి 70 ఏళ్లు దాటిన మాజీ జస్టిస్ కనగరాజ్‌ను ఏపీ ఎస్ఈసీగా నియమించేందుకు విజయవాడకు తీసుకువచ్చారన్నారు. వెంటనే ఆయనను క్వారంటైన్‌కు పంపించాలన్నారు.

కనగరాజ్‌ను క్వారంటైన్‌కు పంపకపోతే భవిష్యత్‌లో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని హనుమంతరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో నిబంధనలు అమలులో ఉన్నప్పుడు తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్ విషయంలో ఎందుకు నిబంధనలు పాటించలేదన్నదానిపై ఏపీ ప్రభుత్వం సమాధానం  చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts