telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్‌

Minister Lokesh comments YS Jagan

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీపోలింగ్నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీ  మంత్రి లోకేష్‌ స్పందించారు. రీపోలింగ్‌పై కోర్టును ఆశ్రయించామని లోకేష్‌ తెలిపారు. 40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఈసీ విడుదల చేస్తామంటున్న వీడియోలు నిజమో కాదో చూడాలని తెలిపారు.

రీపోలింగ్‌పై తమ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఎలక్షన్ కమిషన్ మారిందని ఆయన దుయ్యబట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారి బెంగాల్‌లో ఒకరోజు ముందే ప్రచారం నిలిపివేశారని, ఈసీపై తమ పోరాటం కొనసాగుతుందని నారా లోకేష్‌ తెలిపారు.

Related posts