telugu navyamedia
సినిమా వార్తలు

ఇద్దరి మంచి కోసమే విడిపోయాం – విడాకుల‌పై చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

సమంతతో విడాకుల వ్య‌వ‌హారం పై తొలిసారిగా స్పందించారు హీరో అక్కినేని నాగచైతన్య ..విడాకుల త‌రువాత‌ ఇద్దరం హ్యాపీగా ఉన్నామని.. ఇద్దరి మంచి కోసమే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్యను విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది…

Naga Chaitanya Akkineni Latest Images And Wallapers - TamilScraps.com

విడాకుల విష‌యంలో ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయం కాబట్టి పెద్దగా డిస్ట్రర్బ్ లేదు. ఈ సిట్యువేషన్ ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అని చెప్పుకొచ్చారు. ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. ఈ పరిస్థితిలో ఇది ఇద్దరికీ బెస్ట్‌ డెసిషన్‌’ అని తెలిపాడు.ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని అన్నారు. నాగ చైతన్య మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

When Samantha Akkineni's husband Naga Chaitanya's father wanted him to  leave home before his wedding

కాగా, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Related posts