telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

డా.రాజ‌శేఖ‌ర్  “క‌ల్కి” ఫ‌స్ట్ లుక్…

kalki movie first look
డా.రాజ‌శేఖ‌ర్ న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. `అ` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `క‌ల్కి`.      
 శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.  ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగాన‌టిస్తున్నారు.  అశుతోష్ రానా మరియు  నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నూత‌న సంవత్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

Related posts