మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు. అయితే.. తాజాగా క్రాక్ టీం గోవా వెళ్లనుంది. గోవాలో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఉంది…. అందుకే గోవా వెళ్లనుంది ఈ చిత్ర యూనిట్. అయితే.. గోవాలోనే ఒక సాంగ్ షూట్ చేయనున్నారట. ఆ సాంగ్‌లో రవితేజ, శ్రుతి హాసన్ మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపించనున్నారట. ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవుతే.. సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని టాక్.
previous post
next post