telugu navyamedia
సినిమా వార్తలు

లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే..

కరోనా సోకడం వల్ల ఆస్ప‌త్రిలో చేరిన లెజెండరీ సింగర్ ల‌తా మంగేష్కర్ (92 ) ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. మంగళవారం ల‌తా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వయసు దృష్ట్యానే ఐసీయూలో ఉంచినట్లు ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.

అయితే వైద్యులు లతా తాజా హెల్త్ అప్డేట్​ను విడుదల చేశారు. ‘ప్రస్తుతం లతా మంగేష్కర్‌ ఇంకా ఐసీయూ వార్డులోనే చికిత్స పొందుతున్నారు. మరో 10-12 రోజుల పాటు ఆమె అబ్జర్వేషన్‌లో ఉండనున్నారు. కొవిడ్​తో పాటు ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నారు” అని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని అన్నారు.

So-called playback singer': US daily clarifies stands after 'wrongful'  mention of Lata Mangeshkar | Bollywood News – India TV

1948-78 మధ్య కాలంలో 50 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు గాయని లతా మంగేష్కర్. ఈమెను భారత ప్రభుత్వం.. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది.

తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts