telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

పవన్ సినిమాలో రంగస్థలం హీరోయిన్ ఐటంసాంగ్

poojita

రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలంలో ఆది పినిశెట్టికి లవర్ పాత్రలో నటించింది పూజిత పొన్నాడ. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. పవన్ కళ్యాన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కథ రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందని సమాచారం. కాగా ఈ సినిమాలో ఓ పాటలో తెలుగమ్మాయి పూజిత కనిపించనుందట. అంతేకాదు ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ పూజితపై సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హిందీ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ పవన్ సరసన నటించనుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

Related posts