బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం ముగింపు దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో విన్నర్ ఎవరో తేలిపోనుంది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. నిన్నటి ఎపీసోడ్‌లో అలీ, శివజ్యోతిలకు అరటిపండ్ల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ అరటిపళ్లు తింటారో వారికి బేటరీ రీఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఈ టాస్క్‌లో అలీ నెగ్గి.. బేటరీ లైఫ్ పెంచుకున్నారు. మరో వైపు వరుణ్, రాహుల్‌లకు ఇచ్చిన టాస్క్‌లో ఇద్దరి మధ్య కొంత ఫిజికల్ అయ్యి హింసాత్మకంగా మారింది. ఈ టాస్క్‌లో ఎవరి బ్యాగ్ లో థెర్మోకోల్ బాల్స్ ఎక్కువ ఉంటాయో వారే గెలిచినట్లు బిగ్ బాస్ చెప్పారు. దీంతో రెచ్చిపోయిన రాహుల్, వరుణ్ ఒకరితో మరొకరు ఫిజికల్‌గా ఎటాక్ చేసుకుంటు కిందపడి టాస్క్‌లో గెలవడానికి ప్రయత్నించారు. ఈ టాస్క్‌లో రాహుల్ గెలిచాడు. కాగా మరోటాస్క్ బాబా భాస్కర్, అలీ రెజాలకు పడింది. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మట్టి పెట్టెలో పూలను నాటాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఇద్దరూ పూల చెట్లను నాటే క్రమంలో ముందుగా బాబా భాస్కర్ పూలను అలీ లాగి విసిరేశాడు. దీంతో అలీ పూలను బాబా భాస్కర్ కూడా లాగేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బాగానే తోపులాట జరిగింది. కాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో అలీ, బాబాలు తీవ్రంగా తోపులాడుకుంటున్నారు. కొంత ఫిజికల్ కూడా అయ్యింది. ఒకరిని ఒకరు బలంగా తోపుకుంటూ.. తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా పక్కనే ఉన్న శ్రీముఖి, శివ జ్యోతీ, వరుణ్, రాహుల్.. చూస్తూ.. షాక్‌కు గురైయారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
#Ali ki #BabaBhaskar ki madhyalo jarigina fight lo evaru gelicharu?#BiggBossTelugu3 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/zWDLv9aZCD
— STAR MAA (@StarMaa) 22 October 2019
అతన్నే పెళ్ళి చేసుకుంటా… లవ్ ఎఫైర్ పై కియారా కామెంట్స్