telugu navyamedia
సినిమా వార్తలు

‘ఒక లైయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు.. క్రాస్‌ బ్రీడ్‌ సార్ నా బిడ్డా’..

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్‌ ట్రైలర్‌ వచ్చేసింది.​

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను గురువారం ఉదయం మెగాస్టార్​ చిరంజీవి, రెబల్​స్టార్​ ప్రభాస్​ సోషల్​మీడియా వేదికగా ట్రైలర్​ను విడుదల చేశారు.

యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్‌, పవర్​ఫుల్​ డైలాగ్స్​, ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్‌.​ ట్రైలర్‌ అదిరిపోయింది ‘ఒక లైయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్ నా బిడ్డా’ అంటూ ర‌మ్మ‌కృష్ణ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది.

 దీనికి తోడు ఈ సినిమాలో విజయ్ నత్తితో సమమతమయ్యే క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. చివరగా మైక్ టైసన్ డైలాగ్ కూడా బాగుంది. ఇక రమ్యకృష్ణ పాత్ర కూడా ఊరమాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె విజయ్‌కి తల్లి పాత్ర పోషించగా, హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. మథర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 ఈ సినిమా విడుదల కానుంది.

Related posts