telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సెన్సేషనల్ రీమేక్ లో వెంకటేష్

Venkatesh

కోలీవుడ్‌లో దర్శకుడు వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌ అంటేనే వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తారనే అంచనాలు బోలెడు ఉంటాయి. వీరి కాంబినేషన్‌లో తాజాగా నాలుగో చిత్రంగా ‘అసురన్‌’ రూపొందింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, తమిళ ప్రముఖ హీరో ధనుష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. మలయాళ సీనియర్‌ నటి మంజు వారియర్‌ ఈ చిత్రం ద్వారా తమిళంలోకి అడుగు పెట్టారు. ప్రకాశ్‌రాజ్‌, పశుపతి, పవన్‌, యోగిబాబు, ఆడుగలం నరేన్‌, తలైవాసల్‌ విజయ్‌, గురు సోమసుందరంలు, దర్శకులు బాలాజీ శక్తివేల్‌, సుబ్రహ్మణ్య శివలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల నాలుగో తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ‘అసురన్’ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది ‘అసురన్’ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అసురన్ రీమేక్‌లో నటించనున్నారు. తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

Related posts