ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని వల్లభనేని వంశీ ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే.. లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ,మీలా నేను అడ్డదారిలో ఎమ్మెల్సీ కాలేదన్నారు. ప్రజల్లో గెలిచిన నన్ను రాజీనామా చేయమంటున్నారు, ప్రజల్లో ఓడిపోయిన లోకేష్ ఎమ్మెల్సీగా ఉండాలా?, అని నిలదీశారు.
సోషల్‌మీడియాలో నాపై తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేయాలని కోరానని తెలిపారు. అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు, ఓ ఇంటి నుంచి 10 వేల ఈ-మెయిల్స్ పెట్టారు, మా అందరిపై దుష్ప్రచారం చేసే హక్కు లోకేష్‌కు ఎవరు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి రాకముందే తనపై కేసులు ఉన్నాయన్నారు. మొన్న ఎన్నికల ముందు కూడా కేసులు పెట్టారని తెలిపారు.