రైతులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రైతు రుణమాఫీ పథకం కింద నాలుగో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 4వ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్లు విడుదల చేసింది. 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.39 వేల చొప్పున జమ కానుంది. దీనికి సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియా ఎదుట వెల్లడించారు.
రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే.. వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని కుటుంబరావు తెలిపారు. మొత్తం 58.32 లక్షల మంది రైతుల్లో 23.76 లక్షల మందికి తొలి విడతలో రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఖరీఫ్ లోగా అన్నదాత సుఖీభవ పూర్తి చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో విధ్వంస, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు..