కోలగట్ల శ్రావణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆమెను నియమించినట్టు ఓ ప్రకటన వెలువడింది. ఇక తన నియామకం గురించి తెలుసుకున్న శ్రావణి, ఓ ప్రకటన విడుదల చేస్తూ, అందరి సహకారంతో వైసీపీ మహిళా విభాగాన్ని పటిష్టం చేయడమే తన లక్ష్యమని అన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా, ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ హామీలైన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కృషి చేస్తానని తెలిపారు. కాగా, ఇదే సమయంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన షేక్ షఫీ, సాలూరు పట్టణ రైతువిభాగం అధ్యక్షుడిగా కే రమేష్, రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా పప్పల లక్ష్మణ, బంటు కన్నంనాయుడులను నియమించినట్టు వైసీపీ ప్రకటించింది.