telugu navyamedia
రాజకీయ

టీడీపీకి 120 సీట్లు రావడం ఖాయం : చినరాజప్ప

Chandrababu rejects peddapuram seat
మొన్న జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీకి 110 నుంచి 120 సీట్లు రావడం ఖాయమని  డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప జోస్యం చెప్పారు. ఈ సారి కూడా కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రతిపక్ష హోదా డౌటేనన్నారు. అమరావతిలో జరిగిన హోంశాఖపై సమీక్షలో పాల్గొన్న చినరాజప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగానే ఉందని చెప్పుకొచ్చారు.  
రాష్ట్ర ప్రభుత్వ కేర్ టేకర్ గా చంద్రబాబు  సమీక్షలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే సమీక్షలు తప్పనిసరి అని చెప్పారు. వివేకానందరెడ్డి వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఎలా దాడి చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చినరాజప్ప స్పష్టం చేశారు.  చంద్రబాబు తో జరిగిన సమీక్ష సమావేశంలో  చినరాజప్పతోపాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts