telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుకు ఈసీ మరో షాక్.. సమీక్షలపై  నిషేదం

election commissioner faced evm issue
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎన్నికల సంఘం మరోసారి షాకిచ్చింది.  పలు శాఖలపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడాన్ని  ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తప్పుబట్టారు. సీఎం హోదాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం  అమరావతిలో పోలవరం ప్రాజెక్టు పనుల పురుగోతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షతో పాటు తాగునీటి సమస్య ఇతర సమస్యలపై ఆయన సమీక్ష  చేశారు. ఈ సమీక్షలపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. అయితే  జూన్ 8వ తేదీ వరకు తాను సీఎంగా ఉంటానని కూడ ఆయన చెప్పారు. తమది అపద్ధర్మ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. 
కొత్త నిర్ణయాలు తీసుకోకూడదని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. సాధారణ పాలనలో భాగంగా సమీక్షలు నిర్వహించడంలో తప్పేం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో  ఈసీ గురువారం స్పందించింది. అధికారులతో సమీక్షలు నిర్వహించడం, వీడియో కాన్పరెన్స్‌లు నిర్వహించడం కూడ ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులు ఏం చేయాలనే విషయమై మరోసారి  ఈసీ వివరించింది.

Related posts