నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి 782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా.. ఈనెల 4 జరిగిన నేరేడ్‌మెట్ డివిజన్ కౌంటింగ్ ను మధ్యలోనే నిలిపివేశారు. హైకోర్టు సూచనతో ఇవాళ మళ్లీ నేరేడ్‌మెట్ కౌంటింగ్ ను కొనసాగించారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్ధిపై 782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ కొత్త కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. కాగా… జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 స్థానాల దరికి చేరింది. చాలా స్థానాల్లో స్వల్పమెజారిటీతో అభ్యర్థులు గెలుపుసాధించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో సైలెంట్ కరెంట్ కనిపించింది. అధికార టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడుతూనే.. బీజేపీకి ఏకంగా 49 స్థానాలు కట్టబెట్టారు. ఎవ్వరూ ఊహించని విధంగా పలుస్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది.గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ .. ఇప్పుడు కేవలం 56 స్థానాలకే పరిమితమైంది.
previous post
next post