telugu navyamedia
రాజకీయ వార్తలు

వైట్ హౌస్ వద్ద కాల్పులు.. ఆగిన ట్రంప్ సమావేశం!

trump usa

వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా సమీపంలో ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు ఎన్ కౌంటర్ చేయడంతో తన సమావేశాన్ని ఆయన మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. కాల్పుల ఘటన తెలియగానే ఎస్కార్ట్స్ బృందం, ట్రంప్ ను చుట్టుముట్టి, అక్కడి నుంచి తీసుకెళ్లింది.

జరిగిన ఘటనపై వాషింగ్టన్ డీసీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి డౌగ్ బుచానన్ వివరణ ఇచ్చారు. సోమవారం సాయంత్రం 5.55 గంటల సమయంలో సీక్రెట్ సర్వీస్ విభాగం నుంచి ఓ ఫోన్ వచ్చింది. సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఓ వ్యక్తిని శరీరం పైభాగంలో కాల్చాల్సి వచ్చిందని చెప్పారు. ఆ వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాం” అని అన్నారు.

ఘటనపై తదుపరి ట్రంప్ కూడా వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి వద్ద ఆయుధం ఉందని, నిషేధిత ప్రదేశంలోకి ఆయుధంతో రావడమే ఈ ఘటనకు దారి తీసిందని స్పష్టం చేశారు. బయట జరిగిన ఘటన గురించి తనకు పూర్తిగా తెలియదని అన్నారు.

Related posts