భారత్ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ ప్రపంచ టీ20 ప్రపంచ కప్ ను అక్కడి నుండి తరలించే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ వసీం ఖాన్ అన్నారు. కరోనా కారణంగా భారత్ లో జరిగే ఈ టోర్నీ పై ఇంకా కొంత అనిశ్చితి ఉంది. అయితే దీనిని యూఏఈ వేదికగా నిర్వహించేందుకు కూడా అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ దీని పై ఏప్రిల్ నాటికి స్పష్టత వస్తుంది అని ఖాన్ చెప్పారు. అయితే 2021 ప్రపంచ టీ20 వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య భారత్ వేదికగా జరగనుంది. అయితే ఈ టోర్నీ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉండగా.. అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆ తర్వాత దీని హోస్టింగ్ హక్కులు బీసీసీఐ కి అప్పగించింది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పుడు 2022 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 లో భారత్ 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలో టీ 20 ప్రపంచ సుప్ కోసం పాకిస్తాన్ జట్టుకు వీసాలు జారీ చేయడంపై జనవరి నాటికి ఐసీసీ, బీసీసీఐ నుండి లిఖితపూర్వక ధృవీకరణ కోసం పాకిస్తాన్ బోర్డు వేచి ఉందని ఖాన్ అన్నారు. ఇక 2021 ఆసియా కప్ శ్రీలంకలో జరగనుందని ఖాన్ చెప్పారు. గత వారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క ఆన్‌లైన్ సమావేశంలో, శ్రీలంకలో వాయిదా వేసిన ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బోర్డు జూన్‌ను నిర్ణయించిందని, అయితే అవసరమైతే తేదీలను తిరిగి షెడ్యూల్ చేయవచ్చని వసీం ఖాన్ అన్నారు
previous post
ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు: విజయసాయి