telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం..

పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ.. వైఎస్సార్ సీపీ ఎంపీ  రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం ఎలా అవుతుందని..ఏపీకి ఉన్న ఏడు లక్షల కోట్ల అప్పుల్లో రూ.లక్ష కోట్లు ఏపీ ప్రభుత్వ పెద్దలే తినేశారంటూ ఆరోపించారు

ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చి వెళ్లిన అనంతరం బుధవారం రఘురామ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఈ నెల 17 సీఐడీ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. గత కేసుల్లో మరిన్ని వివరాలు తీసుకునేందుకు రావాలన్నారని తెలిపారు.

తనకు చట్టాలు, రాజ్యాంగం, కోర్టులు అంటే గౌరవం ఉందన్నారు. ఇన్నాళ్లూ అడగకుండా పండుగ రోజుల్లోనే తనను విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఐడీ, సీఎం జగన్‌కు పండగ రోజే విచారణ గుర్తొచ్చిందా? పండగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలని ప్ర‌శ్నించారు.

సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని…. ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

కరోనా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతా. గతంలో తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఆ సమయంలో కెమెరాలు ఎందుకు లేవు. ఈ విషయమై తాను సుఫ్రీం కోర్టులో మరోసారి విచారణ చేయాలని కోరుతానని చెప్పారు.

ప్రజల కోసం, రాజధాని కోసం రాజీనామాకు రెడీ.. ఈ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజల సహకారంతో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5 తర్వాత కచ్చితంగా రాజీనామా చేస్తానని రఘురామ అన్నారు.

Related posts