telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా నిత్యావ‌స‌రంగా మారింది – బాల‌కృష్ణ‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్…ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటితో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ..తెలుగు సినీ పరిశ్రమకి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు ఉండాలని  బాలకృష్ణ  అన్నారు. ఏపీలో సినిమా వాళ్ల గోడును పట్టించుకునేవాళ్లే లేరని వ్యాఖ్యానించారు.

చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా ఉండదని వ్యాఖ్యానించారు. పెద్ద సినిమా ఫెయిల్ అయితే దాన్ని చిన్న సినిమా కూడా అనరని అన్నారు. కానీ చిన్న సినిమా హిట్ అయితే దానిని పెద్ద సినిమా అంటారని చెప్పారు. 

సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించాలని ఆకాంక్షించారు.  సినిమా బాగుండాలనేదే తన కోరిక అని చెప్పారు. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం తన డిక్షనరీలో లేదని చెప్పారు. 

Tollywood Hero Nandamuri Balakrishna reacts on AP cinema ticket rate issue in Akhanda thanks meet | Balakrishna reacts on ticket rates : టికెట్ రేట్ల విషయంలో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం | వినోదం News in ...

సినీ పరిశ్రమలో నెలకొన్న టికెట్ల విష‌యంలో సిని పరిశ్రమ అంతా కలిసికట్టుగా ఉండాలన్న ఆయన.. ధరలపై సినీ పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామ‌ని అన్నారు. 

‘సినిమా టికెట్ల వ్యవహారం ఒక్కరితో ముడిపడింది కాదు. అన్నీ ఛాంబర్లు (ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ , మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్) వారు కూర్చొని చర్చించాలి. ఇక్కడ వాదన, టికెట్ రేట్లు పెంచడమా తగ్గించడమా..? అయితే ఇక్కడ నా ఒక్కడి అభిప్రాయం కాదు.. ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలి.

సినిమా ఇప్పుడు నిత్యావసరంగా మారింది. అందుకే రేట్లు అందుబాటులో ఉండడం అనేది సరైనదే కావచ్చు. కానీ ఈ పాండామిక్ పరిస్థితులో ఇది సరైనాదేనా అనేది ఆలోచించాలి.

టికెట్లతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. వాళ్లకు కూడా అనుమానం ఉండచ్చు, ప్రజలు థియేటర్ లకు వస్తారో లేదో అని.. కానీ, అఖండ విజయం చూసి అర్ధం అవుతుంది వారికి కూడా అంటూ చెప్పుకొచ్చారు. మ‌రోసారి ప్ర‌భుత్వం టికెట్ల విష‌యంపై ఆలోచించాల‌ని బాల‌కృష్ణ తెలిపారు

Related posts