telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డబ్బుల సంచులు.. లిక్కర్ బాటిల్స్ తో గెలవాలని చూస్తున్నారు…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఏ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు సీటు ఇవ్వలేదని…పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈసారి ఓ గిరిజనుడికి అవకాశం కల్పించిందని..రాములు నాయక్ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో రాములు నాయక్ చిత్తశుద్దితో పనిచేశారని.. కేసీఆర్ నిరంకుశ ధోరణి నచ్చక టిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారని పేర్కొన్నారు. అన్ని పార్టీలు రెడ్డిలకే సీట్లు ఇచ్చాయని… ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఎస్టీకి టికెట్ ఇచ్చిందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతికత లేదని..ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు నిరుద్యోగుల కోసం పని చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉందని..కోదండరాంకు ఓటు వేస్తే అది ఉపయోగం లేకుండా పోతుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కేవలం డబ్బుల సంచులు.. లిక్కర్ బాటిల్స్ తో మళ్ళీ ఎమ్మెల్సీ గా గెలవాలని పల్లా చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ ల వల్లనే అన్ని ధరలు పెరుగుతున్నాయని ఫైర్‌ అయ్యారు.

Related posts