telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో నిరుద్యోగం..హెచ్-1బీ వీసాల రద్దు చేసే యోచన!

Hib visa us

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో హెచ్-1బీ సహా, ఆ దేశంలో విదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోగా, ఈ దశలో విదేశాల నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతిస్తే, వ్యతిరేకత పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.

వీసాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం కాగా, ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబర్ 1 లోగా తుది నిర్ణయం వెలువడుతుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపినట్టు పత్రిక వెల్లడించింది. “సస్పెన్షన్ ను ఎత్తివేసేంత వరకూ హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం అమలైతే అత్యధికంగా భారత సాఫ్ట్ వేర్ నిపుణులపైనే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దు నిర్ణయాన్ని అమలు చేస్తే, అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను వదిలేసి స్వదేశానికి రావాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో వైట్ హౌస్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Related posts