telugu navyamedia
రాజకీయ వార్తలు

ఓటు హక్కు వినియోగించుకున్న యోగి ఆదిత్యనాథ్

Mamatha Break Yogi Rali West Bengal

సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని 246 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాట్నాలోని రాజ్‌భవన్‌ పరిథిలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పాట్నాలోని 46వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.

టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌లోని జలంధర్ జిల్లా పరిథిలోని గార్హి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశాడు. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఓటేసేందుకు వచ్చిన భజ్జీ చాలాసేపు క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నా మహిళా కళాశాలలోని 77 నంబరు పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related posts