telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గృహిణులకు శుభవార్త… తగ్గిన వంటగ్యాస్‌ ధరలు

Gas

మన దేశంలో ఇప్పటికే నిత్యవసర ధరలన్నీ… పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌ కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళో, రేపో ఏపీలోనూ పెట్రోల్‌ సెంచరీ కొట్టేయనుంది. అటు వంటగ్యాస్‌ గురించి చెప్పనక్కర్లేదు. గడిచిన మూడు నెలల్లోనే రూ.225 పెరిగింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌ ధర నుంచి తగ్గనుందని ఆయిల్‌ కంపెనీలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి సిలిండర్‌పై రూ. 10 తగ్గనుంది. ఫిబ్రవరిలో వరుసగా ధరల పెరుగుదల ప్రభావంతో ఉన్న గృహిణులకు ఉపశమనం కలిగించేలా గ్యాస్‌ ధర తగ్గింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బుధవారం సిలిండర్‌ ధరలో రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇప్పటికే వారంలో మూడుసార్లు తగ్గించినప్పటికీ, వంట గ్యాస్‌ ధర కూడా సమీప భవిష్యత్తులో తగ్గుతాయని చమురు అధికారులు పేర్కొంటున్నారు. తాజా తగ్గింపుతో ఢిల్లీలో రూ. 819 ఉన్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ. 809 కి చేరుతుంది. ఇతర మార్కెట్లలోనూ తగ్గించిన ధర అమల్లో ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా.. జనవరిలో ధర రూ. 694 గా ఉండగా.. ఫిబ్రవరిలో రూ. 719కు పెరిగింది. ఫిబ్రవరి 15న ధరను మళ్లీ రూ. 769 కు, ఫిబ్రవరి మళ్లీ రూ. 794కు పెంచారు. మార్చిలో ఈ ధర రూ. 819 కు చేరుకుంది.

Related posts