telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మూడు వ్యాక్సిన్లకు తుది దశ క్లినికల్ పరీక్షలు: ట్రంప్

trump usa

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ పై మరోసారి స్పందించారు. వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైనట్టు చెప్పారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అమెరికా పౌరులందరికీ సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్‌కు అనుమతులు లభించిన వెంటనే అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతామన్నారు.నెలకు లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందరికీ సరిపడా డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు.

Related posts