telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా వైరస్ ల్యాబ్‌లోనే పుట్టింది: గడ్కరీ

Nithin Gadkari

కరోనా వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది కాదని, అది వుహాన్ ల్యాబ్‌లో పురుడు పోసుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నోట వినిపించాయి.

బుధవారం గడ్కరీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ సహజ సిద్ధంగా వచ్చింది కాదని, అది ల్యాబ్‌లో పుట్టిందని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శ్రమిస్తున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు.

Related posts