ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ శుక్రవారం ఆసుపత్రిలో చేరారు . తీవ్ర జ్వరంతో ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు.
అయితే ఆయని పరిస్థితి విషమంగా లేదని, నిలకడగా ఉందన్నారు. అతని రక్త పరీక్షల కోసం పంపామని, రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి 2021 బీహార్ ఉపఎన్నికల తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా పాట్నా నుండి ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. అయితే, దాణా కుంభకోణంలోని దుమ్కా ట్రెజరీ కేసులో అరెస్టు అయిన లాలూప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు
లాలూ ప్రసాద్ యాదవ్ కు 3 సంవత్సరాల తర్వాత గత నెలలో బీహార్ తిరిగి వెళ్ళారు. ఏప్రిల్‌లో జార్ఖండ్ హైకోర్టు మిస్టర్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేసింది. లాలూ యాదవ్ ఆరోగ్యం చాలా కాలంగా బాగాలేకపోవడంతో రెండేళ్లుగా రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రిని జనవరిలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు.
బాబు గుడ్డలు చించుకుంటున్నారు: విజయసాయి