కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఆందోళనకర వ్యాఖ్యలు చేసింది. ఈ వైరస్‌ను పూర్తిగా అంతం చేసే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నివారించే అవకాశాలు తక్కువేనని ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నారు.కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా రెండోసారి వ్యాప్తి చెందకుండా చేయొచ్చని పేర్కొన్నారు. అలా చేస్తే లాక్‌డౌన్‌ల నుంచి కూడా ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1.2 కోట్లను దాటేయగా, 5,59,481 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 68 లక్షల మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. మరోవైపు, భారత్‌లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా ? లేక పాకిస్తాన్ లో ఉందా?