telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న తూర్పు నావికాదళం

oxygen sylender

ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి, సరఫరాపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.  నావికాదళం ఈఎన్సీ, విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.  ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను తూర్పు నావికాదళం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది నావికాదళం.  ఒక్కో బృందానికి మూడు నుంచి నాలుగు జిల్లాల ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.  ఆక్సిజన్ ప్లాంట్ల లో సాంకేతిక లోపాలను సవరించేందుకు సావికాదళం సాయం చేస్తుంది. సింగపూర్, థాయిలాండ్, మలేషియా దేశాల నుంచి 25 క్రయోజనిక్ ట్యాంకర్లను తరలించేందుకు నేవీ అంగీకరించింది.  ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు, వైద్య పరికరాల సరఫరాకు నేవీ అంగీకరించింది.  200 డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వానికి అందించేందుకు నేవీ ముందుకు వచ్చింది. చూడాలి మరి ఇది ఎప్పటికి అది పూర్తవుతుంది అనేది.

Related posts