కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్న ఆయన.. ఈ వానాకాలం సీజన్‌లో కూడా రైతు బంధు సాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద రైతులకు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించిన ఆయన.. సమైక్యాంధ్ర పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు.. కానీ, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అల్ టైం హై దిగుబడులు సాధించి గొప్ప పెరును సంపాందించింది.. తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్కూచిగా నిలిచిందని తెలిపారు. ఇక, ఎఫ్‌సీఐ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నరాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సాధించిందన్నారు మంత్రి కేటీఆర్.
previous post
next post
ప్రజలు తిరస్కరించినా లోకేశ్ కు బుద్ధి రాలేదు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు