telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఖాతాదారుల‌న అల‌ర్ట్ చేసిన ఎస్బీఐ…

ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోవ‌డంతో… సైబ‌ర్ నేర‌గాలు ఫోన్లు చేసి.. ఖాతాదారుల వ్య‌క్తిగ‌త వివ‌రాలు, ఖాతా నెంబ‌ర్లు, పాస్‌వ‌ర్డ్‌లు, ఓటీపీలు తెలుసుకుని.. ఖాతాల్లో ఉన్న సొమ్ము మొత్తం ఊడ్చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని తమ ఖాతాదారులుకు సూచిస్తున్నాయి. తాజాగా ఈ సైబర్ మోసల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులను కోరింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సూచించింది అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ ఎస్బీఐ. సోష‌ల్ మీడియా వేద‌క‌గా.. త‌మ ఖాతాదారుల‌న అల‌ర్ట్ చేసింది ఎస్బీఐ.. విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని కోరింది.. మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇచ్చింది.. ఇక‌, ముఖ్యంగా ఇవి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో చేయొద్దంటూ.. ఐదు పాయింట్స్ సూచించింది.. అందులో.. పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను షేర్ చేసుకోవద్దు అని సలహా ఇచ్చింది..

Related posts