telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కానిస్టేబుళ్లకూ కరోనా..పోలీస్ స్టేషన్ మూసివేత..!

police statiion venkatagiri

ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా కరోనా అందరినీ టచ్ చేస్తోంది. ఈ వైరస్ ధాటికి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీస్ స్టేషన్ మూతవేయాల్సిన పరిస్థితి వచ్చింది. పీఎస్ లో సీఐ, ఎస్సై సహా దాదాపు అందులో పనిచేసే అందరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ఏడుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు, పోలీస్ స్టేషన్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా కరోనా సోకింది.

ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ను మూసివేసిన ఉన్నతాధికారులు, కరోనా బారినపడిన పోలీసులను క్వారంటైన్ కు తరలించారు. ఓ హత్య కేసులో నిందితులను ఎలాంటి పరీక్షలు జరపకుండా స్టేషన్ తీసుకువచ్చి విచారించిన నేపథ్యంలోనే వెంకటగిరి పోలీసులకు కరోనా సోకినట్టు తెలిసింది. ఆ హత్య కేసు నిందితుల్లో ఒకరు కరోనా పాజిటివ్ వ్యక్తి కావడంతో అతడ్ని విచారించిన పోలీసులకు కూడా వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది.

Related posts