telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఆదాయానికి మించిన ఆస్తులు.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు!

acb telangana

తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి ఇంట్లో  ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఉప్పల్ సీఐగానూ పని చేశారు. ఆయన పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో అధికారులు ఒకే సమయంలో తనిఖీలు చేస్తున్నారు. ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏసీపీ న‌ర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2008 నుంచి 2010 వ‌ర‌కు మియాపూర్‌లో సీఐగా ప‌ని చేసిన న‌ర‌సింహారెడ్డి ప‌లు భూవివాదాల్లో త‌ల‌దూర్చి ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

Related posts