telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తెలుగు నిర్మాత ?

Madhu-manthena

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్‌తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు ఒప్పుకున్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికా, రకుల్, నమ్రత పేర్లు బయటకు రావడం సెన్సేషన్ అయ్యింది. వీరికి ఎన్‌సీబీ నోటీసులు ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిర్మాత మధు మంతెనకు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆయన బుధవారం విచారణకు హాజరవుతున్నారని సమాచారం. అనురాగ్‌ కశ్యప్‌, వికాల్‌ బాల్‌, విక్రమాదిత్యతో కలిసి ఫాంటమ్‌ ఫిలింస్‌ను స్టార్ట్‌ చేసిన మధు మంతెన తెలుగులో ఆర్జీవీ చిత్రం ‘రక్తచరిత్ర’ను నిర్మించారు.అలాగే బాలీవుడ్ లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ కంపెనీ క్వాన్‌ కో ఫౌండర్‌ కావడం, పలువురి హీరోయిన్స్‌ డేట్స్‌ను ఆయన హ్యండల్‌ చేస్తుండటం వంటి కారణాలతో మధు మంతెనను ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలిచారని వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts