telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

lockdown hyd

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.29 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇటు తెలంగాణలోనూ  కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. మాస్కులు పెట్టుకోని వారికి రూ.1000 జరిమానా విధించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తాజాగా కరోనా కట్టడి కోసం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. రెంజల్ మండలం కందకుర్తి చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిషేధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కందకుర్తి చెక్ పోస్టు వద్ద బారికేడ్డు ఏర్పాటు చేశారు అధికారులు. మహారాష్ట్ర నుంచి వస్తున్న పది మందిలో ప్రతి ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 

Related posts