telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎంసెట్ నిబంధనల్లో సవరణ…?

ts eamcet

ఎస్సిఈఆర్టీలో విద్యాశాఖ అధికారులతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ భేటీ అయ్యారు. ఎంసెట్ లో 45 శాతం నిబంధనపై చిత్రా రామచంద్రన్ చర్చిస్తున్నారు. నిజానికి కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ ఏడాది జరగాల్సిన పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. పదోతరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు కావడంతో, ఇటీవలే ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాస్ అయినట్టే. అయితే కోవిడ్ వలన పరీక్షలు రాయలేకపోయిన సప్లిమెంటరీ విద్యార్థులను నిబంధనల ప్రకారం 35 శాతం  మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ఇప్పుడు అదే ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుకు అవరోధంగా మారింది. ఎందుకంటే ఒక వేళ పరీక్ష రాసినా నిబంధనల ప్రకారం ఇంటర్ లో 45 శాతం ఉంటేనే ర్యాంకు కేటాయిస్తారు. ఈ నిబంధనతో నష్టపోయిన విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. కోర్టు ప్రస్తుతానికి ఎంసెట్ ప్రక్రియని ప్రస్తుతానికి నిలిపివేసింది. దీనికి సంబంధించి సవరించిన జీవో రెండు రొజులలో ప్రభుత్వం సవరిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు చర్చల అనంతరం ఎంసెట్ నిబంధనలు సవరించే అవకాశం ఉంది. కరోనా కారణంగా చాలా పరీక్షలు

Related posts