telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పదవి రాగానే ప్రతీకారం తీర్చుకున్న మేయర్…

కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు కార్పొరేటర్ గా ఉన్న విజయలక్ష్మి మీద పోలీసులకు ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మేయర్ పీఠం రాగానే పంతం నెగ్గించుకుని ఆయన్ని సీసీఎల్ కు మేయర్ విజయలక్ష్మి బదిలీ చేయించారు. అప్పట్లో బంజారాహిల్స్‌ కార్పోరేటర్ విజయలక్ష్మీ పై షేక్ పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆఫీస్ లోకి బలంతంగా వచ్చి తన మీద దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా తనను అడ్డుకుని, దుర్భాషలాడిందని, కేకే కూతురునంటూ నానా హంగామా చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయలక్ష్మీతో పాటు ఆమె అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో హల్చల్ చేశారని, విజయలక్ష్మీతోపాటు ఆమె అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి  వచ్చి తనను దుర్భాషలాడడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుతుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts