telugu navyamedia
వార్తలు సామాజిక

కేరళకు నైరుతి రుతుపవనాలు!

rains started today and tomorrow in telangana

భానుడి ఉగ్రరూపంతో మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈశాన్య రుతుపవనాలు ఇవాళ కేర‌ళ తీరాన్ని తాకిన‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు అవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌కాలంలో 75 శాతం వ‌ర్షాలు ప‌డే అవకాశాలున్నాయి.

Related posts