telugu navyamedia
రాజకీయ

యూపీ ఆరో విడత పోలింగ్​ : ఓటు వేసిన యోగి ఆదిత్యనాథ్ ..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ ఎన్నికల్లో భాగంగా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరో దశలో 676 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 66 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఆరో విడత పోలింగ్​లో భాగంగా.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్​పుర్​లోని గోరఖ్​నాథ్ కన్యానగర్​ క్షేత్రలోని ప్రైమరీ స్కూల్​లో ఓటేశారు.

ప్రజలంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని.. అన్ని చోట్లా ఇదే ఉత్సాహం కనిపిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజ్యాంగ కర్తవ్యాలపై ప్రజలకు అవగాహన ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 9 జిల్లాల ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేవారు. ఈ ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లు సాధించి బీజేపీ రికార్డు సృష్టిస్తుందన్నారు.

కాగా.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటేసేముందు గోరఖ్‌పూర్ పీఠంలో ప్రార్థనలు చేసి, ఆశ్రయం వద్ద ఉన్న ఆవులకు బెల్లం తినిపించారు.

Related posts