telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో కొత్త రైల్వేలైన్‌కు కేంద్రం బ్రేక్

railway new recruitment policies
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ- గుంటూరు కొత్త రైల్వేలైన్‌కు కేంద్రం మొండిచేయి చూపించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్ సాధ్యపడదని కేంద్రం తేల్చిచెప్పింది. నవ్యాంధ్ర కొత్తరాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ఈ రైల్వేలైనుకు గతంలో ప్రతిపాదించారు. రైల్వే లైన్ అంశంపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు.
ఉపరితల రవాణాశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ  పూర్తికానందున ఈ ప్రతిపాదన ముందుకు సాగే అవకాశం ఇప్పట్లో లేదని మంత్రి గోయల్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి రైల్వేలైన్ హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించాలనడం దుర్మార్గమని చెప్పారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజించిన వారే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపై పోరాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు.

Related posts