telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా బారిన ఉమా భారతి..జ్వరంతో ఆసుపత్రిలో చేరిక!

Umabharathi BJP

బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతికి కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. ఇటీవల ఆమె కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు తేలింది.

దీంతో హరిద్వార్‌, రిషికేశ్‌ మధ్యనున్న వందేమాతరం కుంజ్‌ వద్ద క్వారంటైన్‌లో ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రిలో చేరుతానని ఉమా భారతి మొన్ననే తెలిపారు. జ్వరం ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినట్టు ట్వీట్ చేశారు.

కోవిడ్ పరీక్షల అనంతరం వైద్యులు కనుక తనకు అనుమతి ఇస్తే రేపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడనున్న సందర్భంగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు. నిజానికి తాను కోర్టుకు హాజరు కావాలన్న ఉద్దేశంతోనే ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు.

Related posts